Movie UpdatesTollywood

‘7 Days 6 Nights’ is a movie that entertains the audience in the style of the Hindi film ‘Housefull’ – – Heroine Mehr Chahal.

మెగా మేకర్ ఎం.ఎస్. రాజు దర్శకత్వం వహించిన తాజా సినిమా ‘7 డేస్ 6 నైట్స్’. ‘డర్టీ హరి’తో గతేడాది బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న ఆయన, ఆ తర్వాత తీసిన చిత్రమిది. మెగా బ్యానర్ సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో సుమంత్ అశ్విన్ .ఎం, రజనీకాంత్ .ఎస్ నిర్మించారు. వైల్డ్ హనీ ప్రోడక్షన్స్, వింటేజ్ పిక్చర్స్ మరియు ఏబిజి క్రియేషన్స్ వారు చిత్రనిర్మాణంలో భాగస్వాములు. ఇందులో సుమంత్ అశ్విన్, రోహన్ హీరోలు. సినిమా జూన్ 24న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా హీరోయిన్ మెహర్ చాహల్ మీడియాతో ముచ్చటించారు. *ప్రశ్న: మీ గురించి చెప్పండి…*మెహర్ చాహల్: నేను అస్సాంలో జన్మించాను. మా నాన్నగారు టీ ప్లాంటేషన్స్‌లో వర్క్ చేసేవారు. అందువల్ల, దేశంలో చాలా ప్రాంతాలు తిరిగా. చివరకు, ముంబైలో సెటిల్ అయ్యా. వర్క్ నిమిత్తం నాలుగైదేళ్లుగా ముంబైలో ఉంటున్నాను. ఇప్పుడు నా తల్లిదండ్రులతో కోల్‌క‌తాలో ఉంటున్నాను. అయితే, నేను ఎక్కువ ట్రావెలింగ్ చేస్తూ ఉంటాను. నా కొత్త ప్రాంతాలు చూడటం, కొత్త సంప్రదాయాల గురించి తెలుసుకోవడం ఇష్టం. *ప్రశ్న: ‘7 డేస్ 6 నైట్స్’లో మీకు అవకాశం ఎలా వచ్చింది?*గతంలో కొన్ని సినిమాలకు నేను ఆడిషన్స్ ఇచ్చాను. ముంబైలో మా మేనేజర్ దగ్గర ఎంఎస్ రాజు గారు చూశారట. తర్వాత ఈ సినిమాలో క్యారెక్టర్ కోసం ఆడిషన్స్ ఇస్తారా? అని అడిగారు. హైదరాబాద్ వచ్చి ఆడిషన్ ఇచ్చాను. కథ, క్యారెక్టర్స్ గురించి ఆయనకు బాగా తెలుసు కదా! నేను సూట్ అవుతానని అనుకున్నారు. సెలెక్ట్ చేశారు. *ప్రశ్న: కథలో మిమ్మల్ని ఆకట్టుకున్న అంశం ఏమిటి?*ఇదొక ఫన్ ఫిల్మ్. టోటల్ స్టోరీ నచ్చింది. టీనేజ్, యంగ్‌స్ట‌ర్‌ వైబ్స్ ఉన్న కథ. ఇంతకు ముందు ఎంఎస్ రాజు గారు చేసిన సినిమాలు చూశా. ఆయనతో సినిమా అనగానే ఎగ్జైట్ అయ్యాను. కథ కూడా నచ్చింది. వెంటనే ఓకే చెప్పేశా. *ప్రశ్న: మీరు ఎవరికి జోడీగా నటించారు? మీ పాత్ర గురించి…*నా క్యారెక్టర్ పేరు రతికా. గోవాలోని ఒక రెస్టారెంట్‌లో వర్క్ చేస్తుంది. నార్మల్ టీనేజ్ గాళ్. అంతకు మించి పాత్ర గురించి ఎక్కువ చెప్పలేను. సుమంత్ అశ్విన్ జోడీగా కనిపిస్తా. రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌ సినిమా అని చెప్పవచ్చు. హిందీలో ‘హౌస్‌ఫుల్‌’ సిరీస్‌లో జోక్స్ ఎలా ఉంటాయో… అటువంటి జోక్స్ ఉంటాయి. ఆడియన్స్ బాగా నవ్వుకోవచ్చు. *ప్రశ్న: షూటింగ్ చేసేటప్పుడు భయపడిన సందర్భాలు ఉన్నాయా?*అటువంటివి ఏమీ లేవు. *ప్రశ్న: జాయ్‌ఫుల్‌ మూమెంట్స్?*చాలా ఉన్నాయి. గోవా, మంగళూరు షూటింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు చాలా ఫన్ మూమెంట్స్ ఉన్నాయి. నిజంగా ట్రిప్‌కి వెళ్లినట్టు అనిపించింది. *ప్రశ్న: తెలుగు నేర్చుకునే ప్రయత్నం చేశారా?*నన్ను ఎంపిక చేసిన నెలలోపు షూటింగ్ స్టార్ట్ చేశాం. అందువల్ల, నేర్చుకోవడం కుదరలేదు. షూటింగ్ మధ్యలో కొన్ని కొన్ని పదాలు నేర్చుకోవడం మొదలుపెట్టాను. *ప్రశ్న: సినిమా చూశారా? మిమ్మల్ని మీరు తెరపై చూసుకున్నప్పుడు ఏం అనిపించింది?*|చూశా. ఒక్కసారి కాదు… మూడు నాలుగుసార్లు. చూస్తున్నంత సేపూ నవ్వుతూనే ఉన్నాను. నా గురించి నేను చెప్పలేను. ప్రేక్షకులు చెప్పాలి. *ప్రశ్న: కెరీర్ బిగినింగ్‌లో బోల్డ్ రోల్ చేయడం ఎలా అనిపించింది?*అంత బోల్డ్ ఏమీ కాదు. గోవా వెళ్ళినప్పుడు స్విమ్ సూట్ వేసుకుంటాం! శారీ ధరించి లేదా ఫుల్‌గా డ్రస్ వేసుకుని స్విమ్ చేయలేను కదా! సినిమా చూస్తే తెలుస్తుంది… ఇందులో వల్గర్‌గా ఏమీ లేదు.*ప్రశ్న: పోస్టర్లు, ట్రైలర్లు చూస్తే న్యూ ఏజ్ ఫిల్మ్‌లా ఉంది. ఎంఎస్ రాజు గారు ఎలా తీశారు?*ఆయన అందరితో బాగా కలిసిపోయారు. కొత్తగా నేర్చుకోవాలనే తపన ఆయనలో ఉంటుంది. అందువల్లే, ఆయన ఇంకా హిట్ సినిమాలు తీస్తున్నారు. ఇండస్ట్రీలో ఉన్నారు.*ప్రశ్న: ‘7 డేస్ 6 నైట్స్’ విడుదలకు ముందు ఎంఎస్ రాజు గారితో మరో చేశారు కదా!*అవును. ‘సతి’ చేశా. అందులోనూ సుమంత్ అశ్విన్ హీరో. అదొక థ్రిల్లర్ సినిమా. ఈ సినిమాలో పాత్రకు చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఒక వెబ్ సిరీస్ కూడా చేస్తున్నా. *ప్రశ్న: మీకు నచ్చిన నటీనటులు?*కల్కి కొచ్చిన్, పంకజ్ త్రిపాఠి, విజయ్ వర్మ… రియాలిటీకి దగ్గరగా ఉన్న పాత్రలు చేసే వారు నచ్చుతారు. తెలుగు సినిమాలు తక్కువ చూశా. ప్రభాస్, రానా దగ్గుబాటి, తమన్నా, ధనుష్ హిందీలోనూ సినిమాలు చేశారు కదా! వాళ్ళు తెలుసు. ఇప్పుడిప్పుడే తెలుగు సినిమా గురించి తెలుసుకుంటున్నాను. *ప్రశ్న: చివరగా , ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు?*యూత్ మాత్రమే కాదు, ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూడదగ్గ సినిమా ‘7 డేస్ 6 నైట్స్’. పేరెంట్స్ కూడా చూస్తారు. పోస్టర్స్ చూసి ముందు యంగస్ట‌ర్స్‌ వస్తారు. ఫ్యామిలీతో కూడా ఎంజాయ్ చేసే సినిమా ఇది.

3 thoughts on “‘7 Days 6 Nights’ is a movie that entertains the audience in the style of the Hindi film ‘Housefull’ – – Heroine Mehr Chahal.

  • Hey! I know this is kind of off topic but I was wondering which blog
    platform are you using for this website? I’m getting tired of WordPress because I’ve had problems with hackers and I’m
    looking at options for another platform. I would be fantastic if you could point me in the direction of a good platform.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *